ఉరితీయొద్దు: దోషుల లాయర్‌

న్యూఢిల్లీ: ‘‘వాళ్లను భారత్‌- పాకిస్తాన్‌ సరిహద్దుకు పంపండి లేదా డోక్లాంకు పంపండి. అంతేగానీ వాళ్లను ఉరితీయకండి. వాళ్లు దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాను అఫిడవిట్‌ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. డిసెంబరు 16, 2012లో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు రామ్‌ సింగ్‌, ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌ సహా ఓ మైనర్‌ సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ బాధితురాలు సింగపూర్‌లోని ఆస్పత్రిలో కన్నుమూసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ప్రధాన దోషి రామ్‌సింగ్‌ తీహార్‌ జైలులో ఆత్మహత్య చేసుకోగా... మైనర్‌ విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు దోషులు ముఖేశ్‌, పవన్‌, అక్షయ్‌, వినయ్‌లకు ఉరిశిక్ష ఖరారు కాగా అనేక పరిణామాల అనంతర, మూడుసార్లు ఉరిశిక్ష అమలు వాయిదా పడిన తర్వాత.. తాజాగా మార్చి 20న ఉరితీత ఖరారు చేస్తూ డెత్‌వారెంట్లు జారీ అయ్యాయి. (వాళ్లకు ఏ అవకాశాలు లేవన్న కోర్టు.. కానీ మళ్లీ)