‘ఇది చూస్తున్నంత‌సేపు క‌న్నీళ్లు ఆగ‌లేవు’

ప్ర‌పంచంలో ఏదీ శాశ్వ‌తం కాదు.. ఉన్నంత‌కాలం మ‌నిషి త‌న చుట్టూ జ్ఞాప‌కాల‌ను కూడ‌గ‌ట్టుకుంటాడు. ద‌గ్గ‌రివాళ్లను కోల్పోయాక వాటితోనే కాలం వెళ్ల‌దీస్తాడు. ఇక్క‌డ చెప్పుకునే వ్య‌క్తి కూడా త‌న భార్య‌ను కోల్పోయాడే కానీ ఆమె జ్ఞాప‌కాల‌‌ను కాదు. బ్రిటీష్ యుద్ధంలో పాల్గొన్న కెన్ బెంబో అసిస్టెడ్ అనే వృద్ధుడు ఇంగ్లండ్‌లోని ప్రిస్ట‌న్‌లో నివ‌సిస్తున్నాడు. అత‌ను ప్ర‌తిరోజూ మంచంపై నిద్ర‌కు ఉపక్ర‌మించేముందు త‌న భార్య ఫొటోను క‌ళ్లారా చూసుకునేవాడు. ఇది గ‌మ‌నించిన ఇద్ద‌రు మ‌హిళా కేర్‌టేక‌ర్స్‌(వారి సంర‌క్ష‌ణ చూసుకునేవాళ్లు) అత‌న్ని సంతోష‌పెట్టాల‌నుకున్నారు. (ఇవి మొండి చిరుత పిల్లలు..)